కనిగిరి: నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ ను బలోపేతం చేయాలి: ఎమ్మార్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రాజు మాదిగ
కనిగిరి నియోజకవర్గం లోని గ్రామ గ్రామాన ఎంఆర్పిఎస్ ను బలోపేతం చేయాలని ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నేలపాటి రాజు మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కనిగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం సమీపంలో ఎంఆర్పిఎస్ జండా దిమ్మెకు రాజు మాదిగ శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఎగురవేసే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.