దర్శి: దొనకొండ మండలం నరసింహనాయుడుపాలెం గ్రామంలో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహణ
Darsi, Prakasam | Apr 11, 2025 ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని నరసింహనాయుడుపాలెం గ్రామంలో శుక్రవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభాషిని ఆధ్వర్యంలో పౌష్టికాహారం పక్షోత్సవాల్లో భాగంగా పోషన్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాషిని మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు అదేవిధంగా చిన్నపిల్లలకు సైతం పౌష్టికాహారం అందజేయాలని అంగన్వాడీ కార్యకర్తలు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.