దర్శి: తాళ్లూరు పోలీస్ స్టేషన్ ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో సిసి కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ
Darsi, Prakasam | Apr 10, 2025 తాళ్లూరు పోలీస్ స్టేషన్ లో గురువారం ఎస్సై మల్లికార్జున సిసి కెమెరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాలు, మసీదులు, చర్చిల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నాయకుల విగ్రహాల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన దొంగతనాలు, నేరాలను తగ్గించవచ్చని తెలిపారు.