కనిగిరి: ఈనెల 5వ తేదీన మిట్టపాలెం శ్రీ నారాయణస్వామి ఆరాధన మహోత్సవం: ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహ బాబు
చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి నరసింహ బాబు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీ నారాయణ స్వామి వారి ఆరాధన మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా వీఐపీలకు, గ్రామస్తులకు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు స్వామివారి దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విఐపి లు, గ్రామస్తులు సహకరించాలని ఈవో నరసింహా బాబు కోరారు.