కొండపి: పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి నిరసనగా టంగుటూరు మండల కేంద్రంలో యూపీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన
పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతికి నిరసనగా టంగుటూరు మండల కేంద్రంలోని పురం సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు యూపీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో పలు అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం చర్యలు తీసుకొని నిజనిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.