కొండపి: పొన్నలూరు సెంటర్లో ఎస్ఐ అనూక్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ..10వేల ఈ - చలానాలు విధింపు
పొన్నలూరు మండల కేంద్రంలోని సెంటర్లో సోమవారం ఎస్ఐ అనూక్ వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్, లైసెన్స్ లేని వారిని గుర్తించి 10 వేల విలువైన ఈ-చలానా విధించారు. అలాగే పెండింగ్ చలానాలను వసూలు చేశారు. వాహనదారులు నిబంధన ప్రకారం హెల్మెట్, లైసెన్స్ కలిగి వాహనాలపై ప్రయాణించాలన్నారు. మద్యం సేవించ వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు.