కొండపి: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సింగరాయకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా సింగరాయకొండ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని,మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర ఉండాలని అన్నారు.