రాప్తాడు: సిఎన్ కోట గ్రామంలో విద్యుత్ తీగల వల్ల జరిగే ప్రమాదాలు అరికట్టాలని కనగానపల్లి సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బాలరాజు
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం సి ఎన్ కోట గ్రామంలో ఆదివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి బాలరాజు గ్రామంలో వ్యవసాయ టోటల్ వద్ద క్రిందికి వచ్చిన విద్యుత్ తీగలను గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి బాలరాజు మాట్లాడుతూ ప్రధాని రహదారి పక్కన తోటలకు వెళ్లే దారిలో విద్యుత్ తీగలు క్రిందికి రావడం వల్ల వ్యవసాయ పనులకు వెళ్లే యంత్రాలకు రైతులకు తగిలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని వీటిని విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి విద్యుత్ లైన్లను పైకి సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నామని సిపిఐ బాలరాజు పేర్కొన్నారు.