మార్కాపురం: ఆత్మహత్య చేసుకున్న యశ్వంత్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం మండలంలోని బోడపాడు కు చెందిన యశ్వంత్ రెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పై మాజీ ఎమ్మెల్యే రాంబాబు స్పందించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప యువకుడిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. భయంతో ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబానికి తీరని నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై డీఎస్పీ నాగరాజును వివరించి వినతి పత్రం అందజేశామన్నారు.