రాప్తాడు: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తుంది అనంతపురంలో రాప్తాడు సిపిఐ నేత మల్లికార్జున డిమాండ్
అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం 11 గంటల సమయంలో 2వ డివిజన్ లో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లికార్జున ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తామని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని పేద ప్రజలకు రెండు సెంట్లు స్థలం ఐదు లక్షల రూపాయలు ఇల్లు నిర్మాణానికి ఇచ్చేవరకు పోరాడుతామని రాప్తాడు సిపిఐ మల్లికార్జున పేర్కొన్నారు.