సంతనూతలపాడు: సంతనూతలపాడు లోని వెలుగు కార్యాలయంలో డిఆర్డిఏ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించిన పీ.డీ
ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో రుణ, జీవనోపాధుల ప్రణాళిక సర్వేను ఏన్యు మారేటర్స్, వీవోఏలు గ్రామాల్లో పగడ్బందీగా నిర్వహించాలని DRDA జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ పీ. నారాయణ పేర్కొన్నారు. వెలుగు కార్యాలయంలో గురువారం ప్రారంభమైన 2025-26 వార్షిక సంవత్సరానికి సంబంధించి వీవో ఏల శిక్షణా తరగతులను పీడీ నారాయణ ఆకస్మికంగా సందర్శించి అనంతరం ప్రసంగించారు.