సంతనూతలపాడు: దిత్వా తుఫాన్ పట్ల మండల స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సంతనూతలపాడు నియోజకవర్గంలోని అధికారులతో కలెక్టర్ రాజాబాబు
సంతనూతలపాడు: దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సంతనూతలపాడు నియోజకవర్గంలోని మండల స్థాయి అధికారులకు ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఆదివారం ఒంగోలు కలెక్టరేట్ నుండి సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు మండలాల మండల స్థాయి అధికారులతో ఆదివారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూనే, తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.