దర్శి: దర్శిలో పిరమిడ్ ధ్యాన మందిరం ఏర్పాటులో అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు
దర్శిలో పిరమిడ్ ధ్యాన మందిరం ఏర్పాటులో బుధవారం మహిళా మణులు అధిక సంఖ్యలో పాల్గొని సంబంధిత కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. అంకాలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో పిరమిడ్ ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తున్నట్లు, అందుకుగాను బుధవారం ఆలయ కమిటీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దర్శి పట్టణంలో ఈ విధమైన ఏర్పాటు చేయడం వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.