దర్శి: దొనకొండ మండల కేంద్రంలో ఈ నెల 8వ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహణ: దర్శి టీడీపీ ఇంఛార్జి గొట్టిపాటి లక్ష్మి
దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండల కేంద్రంలో రైతు సేవ కేంద్రం నందు ఈనెల 8వ తేదీన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి సోమవారం తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దొనకొండ మండల పరిధిలో ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కావున మండల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి యొక్క సమస్యలను అర్జీల రూపంలో సమర్పించాలని ఆమె తెలిపారు.