మార్కాపురం: కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న నిర్వాసితులు. మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామంలో పట్టాల పంపిణీకి స్కూల్ బస్ లో వెళ్లిన జిల్లా కలెక్టర్ విజయ సునీత బృందాన్ని నిర్వాసితులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో అక్కడ నిర్వాసితులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాలేదని తమ సమస్యలను పరిష్కరించాలని గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.