పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లో కలెక్టర్ పర్యటన
నిర్వాసితులందరికీ న్యాయం చేయడానికి ప్రభుత్వం ఉందని భరోసా
పునరావాస కాలనీలలో సకల సదుపాయాలు కల్పించాం
నిర్వాసితుల త్యాగనిరతిని రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని పునరుద్ఘాటన.
మార్కాపురం 27.8.26
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల్లోని గొట్టిపడియ, అక్కచెరువు తాండాలను జిల్లా స్థాయి అధికారులందరితో కలసి సందర్శించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పరిశీలించారు.
ముందుగా గొట్టిపడియ గ్రామంలో పర్యటించి అక్కడి నిర్వాసితుల సమస్యలను తెలుసుకున్నారు. పరిహారం పంపిణీ పరిస్థితి పై ఆరా తీశారు. ఇప్పటికే అత్యధికులకు నష్టపరిహారం అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందుతుందని భరోసా కల్పించారు.
గ్రామంలో అర్హులైన అందరికీ న్యాయం చ