కనిగిరి: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు శుక్రవారం తుదిగడుగు కావడంతో రైతులతో కిటకిటలాడిన వెలిగండ్లలో మీసేవ కామన్ సర్వీస్ సెంటర్లు
వెలిగండ్ల: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును పెంచాలని వెలిగండ్ల మండలంలోని రైతులు కోరుతున్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి నేడు శుక్రవారం తుది గడువు కావడంతో వెలిగండ్ల మండలంలోని పలు మీసేవ కామన్ సర్వీస్ సెంటర్ ల వద్ద రైతులు బీమా చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కామన్ సర్వీస్ సెంటర్లు రైతులతో కిటకిటలాడాయి. దరఖాస్తులను అప్లోడ్ చేస్తున్న సమయంలో సర్వర్ సమస్యలు వస్తున్నాయని, ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గడువును పెంచాలని రైతులు కోరుతున్నారు.