బయ్యారం: సాగునీటి కోసం హైదరాబాద్ వెళ్లిన ప్రజా ప్రతినిధుల బృందం
బయ్యారం చెరువు, తులారం ప్రాజెక్టుకు గోదావరి నీటిని తరలించాలని, గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కోరం కనకయ్య నేతృత్వంలో ప్రజా ప్రతినిధుల బృందం హైదరాబాద్ బయలుదేరింది. మంత్రులను కలిసి బడ్జెట్ కేటాయింపులు, కాలువల పనులు, రహదారులు మరియు మంచినీటి సమస్యలపై వినతి పత్రం ఇవ్వనున్నారు.