కనిగిరి: పామూరు మండలం వగ్గం పల్లి గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
పామూరు మండలంలోని వగ్గం పల్లి గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్, రెవిన్యూ, విద్య, గృహ నిర్మాణం తదితర సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.