దర్శి: రేపు జిల్లా వ్యాప్తంగా ఏపీటీఎఫ్ నిరసన కార్యక్రమం నిర్వహణ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి
ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల పాత తాలూకా మండల విద్యా కేంద్రాల వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు వాకా జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆదివారం దర్శి పట్టణంలో జరిగిన సమావేశంలో జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.