దర్శి: రెవిన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజలకు అందుబాటులో ఉంటా : దొనకొండ మరియు దర్శి మండలాల తహాసిల్దార్ శ్రావణ్ కుమార్
దర్శి తహసిల్దార్ శ్రావణ్ కుమార్ దొనకొండ మండల ఇంచార్జ్ తహసిల్దార్గా అదనపు బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొనకొండ మండల తహాసిల్దార్ మెడికల్ లీవ్ పై నెలరోజులపాటు వెళ్లిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దర్శితోపాటు అదనంగా దొనకొండ మండల తహాసిల్దార్ గా బాధ్యతలను స్వీకరించినట్లు తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రెవెన్యూ సమస్యలను ఎప్పటికి అప్పుడు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.