దర్శి: దొనకొండ మండల పరిధిలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు: ఏపీఓ కల్యాణి
దొనకొండ మండల పరిధిలో ఉపాధి హామీ పనులలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని దొనకొండ మండల ఉపాధి హామీ ఏపీఓ కళ్యాణి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు వచ్చిన వారికి మాత్రమే మస్టర్లు వేయాలని, అదేవిధంగా ఖచ్చితమైన కొలతలతో కూలీలకు దినసరి వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులకు వచ్చే వారికి అధికారులు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని తెలిపారు