దర్శి: దర్శి టిడిపి ఇన్చార్జి ఆధ్వర్యంలో అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకు భారీగా వెళ్ళిన ప్రజలు
అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో దర్శి టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి కూటమి శ్రేణులు శుక్రవారం ఉదయం తరలి వెళ్లారు. అమరావతిలో జరగనున్న భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శి నుంచి ఆరు బస్సులు, మరికొందరు సొంత వాహనాలతో అమరావతికి బయలుదేరారు.