దర్శి: దొనకొండ మండలం పోలేపల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్ఐ త్యాగరాజు
దొనకొండ మండలంలోని పోలేపల్లి గ్రామంలో గురువారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమాన్ని దొనకొండ ఎస్సై త్యాగరాజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజల సైతం దొంగతనాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలకు మాదకద్రవ్యాలు మరియు ఇతరత్రా చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని , అనుమానిత వ్యక్తులకు బ్యాంకు ఓటీపీలను చెప్పరాదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు