కనిగిరి: ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
పామూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీపీ గంగసాని లక్ష్మీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు పనిచేయాలన్నారు. గ్రామాల్లో ఎక్కడా ఎద్దడి రాకుండా చూసుకోవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అధికారులు పరిష్కరించలేని సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు ,పాల్గొన్నారు.