కనిగిరి: పామూరు పట్టణంలో వైభవంగా శ్రీ మదన వేణుగోపాలస్వామి రథోత్సవ కార్యక్రమం, భారీగా తరలివచ్చిన భక్తులు
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ మదన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పామూరు పట్టణం తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు. భక్తులతో పామూరు పట్టణ రహదారులు కిటకిటలాడాయి. రథోత్సవంలో ఎటువంటి ఆవంచనయ ఘటనలు జరగకుండా సిఐ భీమానాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు.