సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో అడుగంటిన చెరువు, గుండ్లకమ్మ జలాశయం నుండి నీటిని విడుదల చేసి చెరువును నింపుతున్న అధికారులు
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు చెరువు కొన్ని రోజులుగా అడుగంటి పోవడంతో గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై స్పందించిన అధికారులు గుండ్లకమ్మ జలాశయం నుండి నీటితో చెరువుని నింపుతున్నారు చెరువులోకి వచ్చిన నీటిని క్లోరినేషన్ చేసి, ఆ తర్వాత కుళాయిల ద్వారా స్థానిక ప్రజలకు తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గుండ్లకమ్మ జలాశయం నుండి చెరువును నింపి , తాగునీటికి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల సోమవారం స్థానికులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.