ఉరవకొండ: మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా ఈగల్ టీంతో కలసి పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు
అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు బెలుగుప్ప మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ శివ, మరియు ఈగల్ ప్రత్యేక అధికారి అమర్నాథ్ రెడ్డి ఏఎస్ఐ ఆంజనేయులు టీం సమక్షంలో బెలుగుప్ప గ్రామంలోనూ మరియు ఎర్రగుడి గ్రామంలోనూ ప్రజలకు బుధవారం ఈగల్ టీం పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మత్తు పదార్థాలకు ఏ ఒక్కరూ బానిసలు కాకుండా ప్రజలకు తెలుపుతూ ఏదైనా మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా విక్రయిస్తున్న వారి గురించి సమాచారం తెలిసిన యెడల ప్రభుత్వ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఎస్ఐ, ఈగల్ టీం సభ్యులు విజ్ఞప్తి జేయడమైనది.