కొండపి: మర్రిపూడి మండలం చిల్లంకూరు గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం చిలంకూరు గ్రామం సమీపంలో 2 బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఇదే గ్రామానికి చెందిన ఏడుకొండలు తన చిన్నాన నరసయ్య ఇద్దరు కలిసి గ్రామ శివారు నుంచి గ్రామంలోకి వస్తుండగా ఎదురుగా వచ్చిన గురునాథం అనే యువకుడు ఢీకొనగా నరసయ్య మృతి చెందాడు. గాయాలైనవారి ఇరువురిని పొదిలికి 108లో స్థానికులు వైద్యశాలకు తరలించారు.