కొండపి: పొన్నలూరు మండలం మాలపాడు గ్రామంలో కోడిపందాలు ఆడుతున్న 23 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లాలో ఒకేచోట కోడి పందాలు నిర్వహిస్తున్న 23 మంది పట్టుబడ్డారు. పొన్నలూరు మండలం మాలపాడు గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 23 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 18 బైకులు, 23 సెల్ ఫోన్లు, రూ.42,860 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని పొన్నలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే కంభంలో పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్ అయ్యారు. కోడిపందాలపై దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.