ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం లో వెలిసిన జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జ్వాలాతోరణం కనుల పండుగ నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం ఎదురుగా భక్తులు దర్శించుకునేందుకు వీలుగా జ్వాలా తోరణం ఏర్పాటు చేశారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈవో చెన్నకేశవరెడ్డి జ్వాలా తోరణం ఒత్తులను వెలిగించి ప్రారంభించారు. దింతో ఆలయంలో ఓం నమశ్శివాయ నామస్మరణ మారుమోగింది