మార్కాపురం మండలం మాల్యవంతునిపాడు గ్రామంలో గత ప్రభుత్వం సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. కానీ ప్రారంభానికి నోచుకోలేదు దీంతో పూర్తయిన సచివాలయ భవనం చుట్టూ చెట్లతో అడవిని తలపిస్తుంది. అంతేకాకుండా ఆకతాయిల చేష్టాలతో కిటికీ అద్దాలు సింక్ తదితర వస్తువులను పగలగొట్టారు. మరోవైపు కరెంటు వైర్లను దోచుకెళ్లారు. ప్రజలకు అందుబాటులోకి రావలసిన సచివాలయం అద్వాన పరిస్థితిలో ఉందని గ్రామస్తులు వాపోయారు..