దర్శి: దర్శి లో దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్: దర్శి సిఐ రామారావు
Darsi, Prakasam | Apr 13, 2025 దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా దేవాలయాలలో చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను దర్శి పోలీసులు శనివారం అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఈ సందర్భంగా దర్శి సిఐ రామారావు మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని వారి వద్ద నుంచి 18 వేల పై చిలుకు నగదును స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు