నర్మెట్ట: ఇప్పలగడ్డ తండాలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం: భారీ శ్రమదానం
జనగామ జిల్లా నర్మెట్ట మండలం ఇప్పలగడ్డ తండాలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. సర్పంచ్ ధరావత్ రాజమణి ఆధ్వర్యంలో గ్రామస్తులు, అధికారులు కలిసి పంచాయతీ పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను డంపింగ్ యార్డులోనే వేయాలని సర్పంచ్ సూచించారు.