జఫర్గఢ్: తమ్మడపల్లి పల్లె దవాఖానాలో వైద్యుల కొరత, భవన నిర్మాణంలో నాణ్యతా లోపాలు
జనగాం జిల్లా జఫర్గడ్ మండలం తమ్మడపల్లి దవాఖానాలో డాక్టర్లు లేరని, భవనం గోడలకు పగుళ్లు వచ్చాయని బీజేపీ మండల అధ్యక్షుడు నాగేశ్గౌడ్ ఆరోపించారు. నిర్మాణంలో నాణ్యతా లోపాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.