ఘన్పూర్ స్టేషన్: స్టేషన్‌ఘన్‌పూర్‌లో డిగ్రీ కాలేజీ కొత్త భవన నిర్మాణానికి భూమిపూజ
స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కొత్త భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. 8.60 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ నిర్మాణాన్ని 2027 ఆగస్టు 1 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల కోసం ల్యాబ్‌లు, లైబ్రరీ వసతులు కల్పించాలని సూచించారు.