సంతనూతలపాడు: ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే స్వయంగా అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి మొత్తం 40 అర్జీలు వచ్చాయని, అందులో భూ సమస్యలు, నూతన పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర సమస్యలు ఉన్నాయన్నారు. అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.