కనిగిరి: పట్టణంలోని ఎన్జీవో కాలనీ, శివనగర్ కాలనీలలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్జీవో కాలనీ, శివనగర్ కాలనీలలో కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. కనిగిరి మున్సిపాలిటీలో ప్రజలకు మౌలిక వసతులను కల్పించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. శివనగర్ కాలనీ, ఎన్జీవో కాలనీలలో మొదటగా డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల వాటిని నిర్మిస్తామన్నారు. ఆ తర్వాత సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు , అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.