కనిగిరి: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం
కనిగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో షాపులను కనిగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ సయానా బేగం సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపుల్లో విక్రయిస్తున్న తినుబండారాలు, కూల్ డ్రింక్స్ తదితర వస్తువులను డిపో మేనేజర్ పరిశీలించి, ఎమ్మార్పీ ధరలకే వాటిని విక్రయిస్తున్నారా, లేకుంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనే వివరాలను ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో పరిసర ప్రాంతాలను, టాయిలెట్లను పరిశీలించి, డిపో పరిసరాలను పారిశుద్ధ పరంగా పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ఆమె వెంట ఆర్టీసీ అధికారులు ఉన్నారు.