కనిగిరి: పట్టణంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధ
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి, కనిగిరి నియోజకవర్గ టిడిపి రాష్ట్ర పరిశీలకు రాలు సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం సుధ మాట్లాడుతూ... ప్రజల నుండి స్వీకరించిన అర్జీలను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కి అందజేయడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే ద్వారా అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.