కొండపి: పొన్నలూరు మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళా పోలీసులు బాధ్యతగా పనిచేయాలి: జిల్లా ఎస్పీ దామోదర్
గ్రామాల్లో మహిళా పోలీసులు బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. పొన్నలూరులో గురువారం మహిళా పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బాలికలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు. సైబర్ నేరాలు నివారణ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా చైతన్యం చేయాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మహిళా చట్టాలపై గ్రామీణ ప్రాంత మహిళలకు పూర్తిస్థాయిలో వివరించాలన్నారు.