కొండపి: మర్రిపూడి మండలం జువ్విగుంటలో భూముల రిసర్వేపై సమావేశం నిర్వహించిన తహశీల్దార్ జ్వాలా నరససింహం
మర్రిపూడి మండలం జువ్విగుంటలో భూముల రిసర్వేపై తహశీల్దార్ అధ్యక్షతన గురువారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ జ్వాలా నరసింహం మాట్లాడుతూ.. భూ రీసర్వే వలన అనేక రకాల ఉపయోగాలున్నాయన్నారు. 100 ఏళ్ల క్రితం భూములు సర్వే జరిగాయని, ప్రస్తుతం నేడు తిరిగి రీ సర్వే ప్రభుత్వ ఆదేశాలమేరకు చేస్తున్నట్లు వివరించారు. రైతులు సర్వేకు సహకరించాలని ఆయన సూచించారు.