కొండపి: పొన్నలూరు పోలీస్ స్టేషన్లో సందర్శించిన జిల్లా ఎస్పీ దామోదర్
పొన్నలూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.