దర్శి: దొనకొండ మండలం గుట్టపల్లిలో నీటి కుంటలో పడి బాలుడు మృతి
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు... బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.