నారాయణపేట్: విద్యార్థుల మేలు కోసం ధన్వాడలో కార్తిక యజ్ఞం నిర్వహించిన పాఠశాల నిర్వాహకులు
నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలోని స్థానిక పాఠశాలలో బుధవారం కార్తిక పౌర్ణమి సందర్భంగా కార్తిక యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం విద్యాభివృద్ధి కోసం ఈ యజ్ఞం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ నారాయణ హెడ్మాస్టర్ అన్నపూర్ణ సిబ్బంది లతా శ్రీ అశ్విని భారతి అనుష శ్రీ లతా అంజలి కిరణ్మయి జయంతి పాల్గొన్నారు. యజ్ఞం అనంతరం విద్యార్థులకు ప్రసాదం పంపిణీ చేశారు.