కనిగిరి: భైరవకోన క్షేత్రంలో ఆలయ అధికారులతో కలిసి నిత్య అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం భైరవకోనలోని శ్రీ భైరవేశ్వర స్వామి నిత్య అన్నదాన సత్యాన్ని కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రమైన భైరవకోన క్షేత్రానికి భారీగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి నిత్యం ఆలయం తరుపున అన్నదానం చేసేందుకు అన్నదాన సత్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.