కనిగిరి: పట్టణంలోని శ్రీ విజయ మార్తాండేశ్వర స్వామి ఆలయ ఆదాయ వనరులను పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
కనిగిరి పట్టణంలోని చారిత్రక శ్రీ విజయ మార్తాండేశ్వర ఆలయ ఆదాయ బందులను పెంపొందించుకొని, ఆలయంలో స్వామివారి ధూప, దీప నైవేద్యాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలో దేవాదాయ శాఖ అధికారులు, కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తో కలిసి శ్రీ విజయ మార్తాండేశ్వర ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ కు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులు త్వరితగతిన చేపట్టాలని, పనులు నాణ్యతగా చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.