కనిగిరి: పట్టణంలోని శంఖవరంలో భూకబ్జాకు పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కేశవరావు
కనిగిరి పట్టణంలోని శంఖవరంలో సర్వే నెంబర్లు 301, 302 రెండులో విలువైన 95 సెంట్ల భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేసిన దోషులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పీసీ కేశవరావు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... భూమిని కబ్జా చేసిన 14 మందిలో కేవలం ఏడుగురిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారని, మిగతా దోషులు ఏడుగురిని కూడా పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని చేయాలన్నారు. కనిగిరి నియోజకవర్గంలో భూ కబ్జాలు ఎక్కువయ్యాయని సిపిఎం ఎప్పటినుండో చెబుతుందని, భూకబ్జాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.