కనిగిరి: పట్టణంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో లివర్, గ్యాస్ ట్రబుల్ వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరం
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో లివర్ జబ్బులు, మరియు గ్యాస్ ట్రబుల్ సమస్యలతో బాధపడుతున్న రగుల కోసం గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య నిపుణులైన డాక్టర్ ఎం కవిత, రమకాంత్ కనిగిరి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలను నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ... ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా వివిధ రకాల జబ్బులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు