కనిగిరి: విధి నిర్వహణలో ప్రమాదాలకు గురికాకుండా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: పామూరులో విద్యుత్ శాఖ డీఈఈ కృష్ణారెడ్డి
పామూరు: విధి నిర్వహణలో ప్రమాదాలకు గురికాకుండా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వహించాలని విద్యుత్ శాఖ డి ఈఈ కృష్ణారెడ్డి సూచించారు. పామూరు పట్టణంలో జాతీయ విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా బుధవారం విద్యుత్ శాఖ సిబ్బందితో కృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ శాఖలోనైనా ప్రమాదం జరిగితే ఆస్తి నష్టం సంభవిస్తుందని, కానీ విద్యుత్ శాఖలో ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం సంభవిస్తుందన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.